హైదరాబాద్: టీకా వేసేందుకు తెరిచిన కోవాగ్జిన్ వైల్ను 2-8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 28 రోజుల పాటు నిల్వ చేయవచ్చని భారత్ బయోటెక్ సంస్థ సోమవారం తెలిపింది. ఈ మేరకు 28 రోజుల ఓపెన్ వైల్ పాలసీని ప్రకటించింది. మిగిలిన కోవాగ్జిన్ టీకా వైల్ను వెంటనే లేదా మరుసటి రోజున పడేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. సీల్ తీసిన టీకా సీసా వృథా గురించి హెల్త్ కేర్ వర్కర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించింది.
టీకా తీసుకునే వారు అందుబాటులో లేకపోతే తెరిచిన కోవాగ్జిన్ వైల్ (ఇంజక్షన్ సీసా)ని 2 నుండి 8 ° C వద్ద నిల్వ చేయవచ్చని హైదరాబాద్‌కు చెందని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. దీనిని మరుసటి రోజున ఉపయోగించవచ్చని లేదా 28 రోజుల వరకు నిల్వ చేయవచ్చని పేర్కొంది.
కోవాగ్జిన్ టీకా జీవిత కాలం తయారీ తేదీ నుండి 12 నెలల వరకు పొడిగింపునకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఆమోదం తెలిపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలో ఉన్న కోవాగ్జిన్ టీకా స్టాక్‌పై ఉన్న ఎక్స్పైరీ గడువు సమీపించినప్పకీ వాటిని వినియోగించుకోవచ్చని, వ్యాక్సిన్ వృథాను అరికట్టవచ్చని వివరించింది.