న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. అమెరికా, భారత్‌లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డౌన్‌డిటెక్టర్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంపై ఒక్క భారత్‌లోనే 800 ఫిర్యాదులు అందాయని ఆ సంస్థ తెలిపింది. తమ సందేహాలకు, ప్రశ్నలకు చాట్‌బాట్ స్పందించ లేదని భారత ఫిర్యాదుదారుల్లో 88 శాతం మంది తెలిపారు.