న్యూఢిల్లీ : ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్‌కు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేస్తున్న భారత సంతతి టెక్ లీడర్ శ్రీనివాసన్ నారాయణన్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. 2023 ఏప్రిల్‌లో ఓపెన్ఏఐలో ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా నారాయణన్ చేరారు. తదనంతరం అదనపు కీలక బాధ్యతలు నిర్వహించారు. తన రాజీనామాను నారాయణన్ ధ్రువీకరించారు. మూడు అద్భుతమైన సంవత్సరాల తర్వాత తాను వచ్చే వారం చివరిలో ఓపెన్ఏఐ నుండి నిష్క్రమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలోనే తాను కంపెనీ నాయకత్వానికి ఈ విషయాన్ని తెలియచేశానని తెలిపారు. భవిష్యత్తు కెరీర్‌పై నిర్ణయం తీసుకునే ముందు తాను భారత్‌లోని తన కుటుంబంతో(ప్రధానంగా తన వృద్ధ తల్లిదండ్రులతో) కొంతకాలం గడిపి విరా మం తీసుకుంటానన్నారు. నారాయణన్ ప్రొఫైల్ ప్రకారం గతంలో ఆయన ఐఈబీఎం, మెటా(ఫేస్బుక్) వం టి ప్రధాన టెక్ కంపెనీలతోపాటు స్టార్టప్‌లలో కూడా పనిచేశారు.