న్యూఢిల్లీ: యూపీ బీజేపీ నేత కుమారుడు పాకిస్థాన్ అమ్మాయిని శుక్రవారం ఆన్లైన్లో ‘నిఖా’ చేసుకున్నాడు. బీజేపీ కార్పొరేటర్ అయిన తహసీన్ షాహిద్ తన కుమారుడు మొహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అంద్లీప్ జారాతో వివాహం నిశ్చయించాడు. వీసా కోసం ప్రయత్నించినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా లభించలేదు. మరోవైపు, వధువు తల్లి రానా యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయూలో చేరడంతో త్వరగా పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరోమార్గం లేక ఆన్లైన్లోనే తన కుమారుడికి నిఖా జరిపించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు.