
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న వేళ ఆన్లైన్ పాఠాలు వినడానికి పేద పిల్లలకు తగిన సదుపాయాలు లేకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద పిల్లలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్ లైన్ విద్య పొందేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని కోరింది. కరోనా కాలంలో పేద పిల్లలు ఆన్లైన్ విద్య పొందేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బడులు వారికి ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని గతేడాది సెప్టెంబర్ 18న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.