శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Srinagar | జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (encounter) ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (encounter) ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
మృతిచెందిన టెర్రిస్టును లష్కరే తొయిబాకు చెందినవాడిగా గుర్తించామన్నారు. అతడు కన్మోహ్ సర్పంచ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. కాగా,
ఈనెల 12న పుల్వామాలో ఉన్న చవల్కాన్‌లో, హంద్వారా జిల్లాలోని నెచమా, గందర్బాల్ జిల్లాలోలోని సెర్చ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఒకరు, లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

