న్యూఢిల్లీ: బీజేపీ నేత ఒకరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో మోదీ నివాసానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కారు నుంచి దిగిన ఆయన మోదీ నివాసం వైపు పరుగెత్తారు. (BJP Leader Runs) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆదివారం ఉదయం మోదీ అధికార నివాసంలో జరిగిన సమావేశానికి పంజాబ్‌కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూకు ఆహ్వానం అందింది. అయితే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ కారణంగా కొంత ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే వాహనం నుంచి దిగిన బిట్టూ తన సెక్యూరిటీ గార్డులతో కలిసి పరుగున రోడ్డు దాటి మోదీ నివాసంలోకి వెళ్లారు. చాలా మంది నేతలు వస్తున్నారని, దీంతో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ఇలా చేసినట్లు మీడియాతో అన్నారు. ఆయన పరుగెత్తిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో లూథియానా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రవ్నీత్ సింగ్ బిట్టూ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఉగ్రదాడిలో మరణించిన పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడైన బిట్టూ గత ఎన్నికల్లో లూథియానా స్థానంలో గెలిచారు. ఈసారి ఓడినప్పటికీ పంజాబ్ బీజేపీలో కీలక నేత అయిన ఆయనకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కింది.
Delhi: BJP leader Ravneet Singh Bittu walks to the PM's residence after his car got stranded in traffic pic.twitter.com/a3KZfdFprL
— IANS (@ians_india) June 9, 2024