బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై కమలనాథుల్లో ఆందోళన కనపడుతున్నది. కుటుంబ పాలన , అవినీతికి వ్యతిరేకమని, ఇతర పార్టీలు వాటికి పుట్టిళ్లని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో దానిపై మాట్లాడలేని పరిస్థితి. విలేకరుల సమావేశాల్లో అమిత్ షా కుటుంబ పరిపాలనకు కొత్త నిర్వచనాన్ని సెలవిచ్చారు. ఒకే కుటుంబానికి పార్టీ, ప్రభుత్వ పదవులు ఇస్తే అది పరివార్ వాద్ అవుతుందని ఆయన అన్నారు.