Facebook Live | ముంబై: శివసేన (యూబీటీ) నేత కుమారుడిని ఒక వ్యక్తి కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఎంహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని దహిసార్ ప్రాంతంలో శివసేన (యూబీటీ) మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ ఘోసల్కర్ ఫేస్బుక్ లైవ్లో ఉండగా ఒక వ్యక్తి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు.
తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకున్నాడు. ఇదంతా ఫేస్బుక్ లైవ్లో రికార్డయ్యింది. ఈ హత్యకు కారణాలు వెల్లడి కాలేదు.