న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను కేవలం 90 నిమిషాల్లో గుర్తించే పరీక్ష విధానాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జన్యుక్రమ విశ్లేషణ సాంకేతికతను ప్రస్తుతం వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడుతున్నది. దీంతో ఈ వినూత్న పరీక్షను తీసుకొచ్చారు. ఒమిక్రాన్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను గుర్తించడంపై ఆధారపడి ఈ పరీక్షను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు వివరించారు.