ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన వ్యక్తి కోలుకున్నాడు. భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిలో మహారాష్ట్రలోని పూణేలో నమోదైన కేసు కూడా ఒకటి. ఇక్కడ ‘ఒమిక్రాన్’ సోకిన వ్యక్తి తాజాగా కోలుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని పూణే మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంజీవ్ వావరే వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన పేషెంట్‌కు ఇటీవల చేసిన కరోనా టెస్టుల్లో ‘నెగిటివ్’ రిజల్ట్ వచ్చిందని, అతన్ని శుక్రవారం నాడు డిశ్చార్జి చేయనున్నామని ఆయన తెలిపారు.
ఒమిక్రాన్ సోకడం గురించి సదరు పేషెంట్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ సోకినప్పటికీ తనలో ఎటువంటి కరోనా లక్షణాలూ కనిపించలేదని, అసింప్టమాటిక్‌గానే ఉన్నానని తెలియజేశాడు.