శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓటమి చవిచూశారు. స్వతంత్య్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ (Abdul Rashid) చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. నార్త్ కశ్మీర్లో విక్టరీ కొట్టిన రషీద్‌కు ఒమర్ కంగ్రాట్స్ తెలిపారు. తన ఎక్స్ అకౌంట్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఓటర్లు తమ మనోగతాన్ని వెల్లడించారని, అదే కీలకమని ఆయన అన్నారు. అబ్దుల్ రషీద్‌కు 350858 ఓట్లు పోలయ్యాయి. ఒమర్ అబ్ధుల్లాకు 191124 ఓట్లు పడ్డాయి. దీంతో 1,59,734 ఓట్ల తేడాతో ఒమర్ ఓటమి పాలయ్యారు.
57 ఏళ్ల రషీద్ అయిదేళ్ల పాటు తీహార్ జైలులో ఉన్నారు. యూఏపీఏ చట్టం కింద గతంలో అతన్ని అరెస్టు చేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ఈ సారి ఆయన పోటీ చేశారు. ఆయన తరపున ఇద్దరు కుమారులు తీవ్ర ప్రచారం చేశారు. బారాముల్లాలో అయిదో దశలో భాగంగా మే 20వ తేదీన ఎన్నికలు జరిగాయి.
I think it’s time to accept the inevitable. Congratulations to Engineer Rashid for his victory in North Kashmir. I don’t believe his victory will hasten his release from prison nor will the people of North Kashmir get the representation they have a right to but the voters have…
— Omar Abdullah (@OmarAbdullah) June 4, 2024