న్యూఢిల్లీ, డిసెంబర్ 31: చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చికిగాను బుధవారం ప్రకటించింది. కాగా, వడ్డీరేట్లలో ఏ మార్పూ లేకుండా ఉంచడం వరుసగా ఇది ఏడో త్రైమాసికం. ఇక ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనపై 8.2 శాతం వడ్డీ ఉంటే, మూడేండ్ల టర్మ్ డిపాజిట్, పీపీఎఫ్లపై 7.1 శాతం, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై 4 శాతం వడ్డీ ఉన్నది. కేవీపీపై 7.5 శాతం, ఎన్ఎస్సీకి 7.7 శాతం, మంత్లీ ఇన్కమ్ స్కీంపై 7.4 శాతం వడ్డీ వస్తున్నది.