న్యూఢిల్లీ, జూన్ 17: ఒకవేళ ఇతర దేశాలు ఈరోజు అకస్మాత్తుగా భారత్కు చమురు అమ్మకాలను నిలిపివేస్తే భారత్ తన బ్యాకప్ నిల్వల నుండి చమురు, గ్యాస్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను 10 రోజులు మాత్రమే ఉపయోగించుకోగలదని కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) బుధవారం విడుదల చేసిన తన తాజా నివేదిక పేర్కొన్నది.
గ్యాస్ నిల్వలు శూన్యం
గ్యాస్ విషయానికి వస్తే భారత్ తన సరఫరాలో దాదాపు సగాన్ని ఎల్ఎన్జీ రూపంలో దిగుమతి చేసుకుంటున్నప్పటికీ ప్రత్యేకమైన వ్యూహాత్మక గ్యాస్ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో ఎరువుల కర్మాగారాలు, నగర గ్యాస్ నెట్వర్క్లు ప్రమాదానికి గురవుతున్నాయని నివేదిక పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనకు సీఈఈడబ్ల్యూ నివేదిక భిన్నంగా ఉంది.