శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 09:17:06

ఏడాది చివరి నాటికి అక్కడ పాఠశాలలు బంద్‌

ఏడాది చివరి నాటికి అక్కడ పాఠశాలలు బంద్‌

భువనేశ్వర్‌ : ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరవకూడదని ఒడిశా సర్కారు నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిసెంబర్‌ 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతుండడంతో సెకండ్‌ వేవ్‌గా భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేసినా పరీక్షలు, మూల్యాకనం, పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. పాఠశాలల్లో ఆన్‌లైన్‌, దూర విద్య తరగతులు కొనసాగుతాయని, కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఆన్‌లైన్‌ బోధన, టెలీకౌన్సెలింగ్‌ ఉంటాయని, బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు రావాల్సి ఉంటుందని చెప్పింది. ఇదిలా ఉండగా దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ మహమ్మారి మధ్య పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో 80 మంది ఉపాధ్యాయులకు కరోనా బారినపడ్డారు. అలాగే ఏపీలో 829 మంది ఉపాధ్యాయులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9-12 తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.