జనాలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. చితకబాదిన స్థానికులు
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు బీభత్సం సృష్టించింది. ఆయన కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు. ఆగ్రహాంతో ఉన్న ప్రజలు.. ఎమ్మెల్యేపై తిరగబడి చితకబాదారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఒడిశాలోని చిలికా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్.. బనాపూర్కు చేరుకున్నారు. అక్కడ బ్లాక్ చైర్‌పర్సన్‌కు ఎన్నికలు జరుగుతుండటంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే ఎమ్మెల్యే కారు జనాలపైకి దూసుకెళ్లింది. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బనాపూర్ ఎస్ఐ ఆర్ ఆర్ సాహుతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి కారణం లేకుండానే జనాలపైకి ఎమ్మెల్యే కారు దూసుకురావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ వారంతా బీజేపీ కార్యకర్తలని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు భువనేశ్వర్‌లోని తంగి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు జగదేవ్‌ను గతేడాది బీజేడీ నుంచి సస్పెండ్ చేశారు.
.@bjd_odisha Chilika MLA Prasant Jagdev brutally mows down public in Banpur. Women & Lady police officers injured. The arrogance of power of @Naveen_Odisha and his MLA’s is clearly visible. #Odisha pic.twitter.com/OxSdP7Tr3v
— Sumit Kumar Behera (@SumitOdisha) March 12, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

