Srisailam Temple | వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలి: దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్
Srisailam temple| సిబ్బంది వసతి గృహ సముదాయాలలో వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆదేశించారు.
Srisailam temple| శ్రీశైల దేవస్థానం నిర్మించిన సిబ్బంది వసతిగృహాలను దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ రోజు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వారు మాట్లాడుతూ.. సిబ్బంది వసతి గృహ సముదాయాలలో వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్‌కు కూడా తగిన ఏర్పాట్లు ఉండాలన్నారు. అంతర్గత రహదారులతో పాటు గృహ సముదాయంలో తగినంతగా వీధిలైట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వసతిగృహాల పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కలను నాటాలని ఆదేశించారు.
ముఖ్యంగా కదంబం, బాదం, వేప మొదలైన చెట్లను నాటేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వసతిగృహాల సముదాయం వద్ద చిన్న ఆలయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని కూడా ఆదేశించారు. కాగా మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి.హెచ్. కె. స్మాల్, 1 – బి.హెచ్. కె. బిగ్ , 2 బి.హెచ్.కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మించింది.
1 – బి.హెచ్.కె స్మాల్ నందు 108 గృహాలు, 1 – బి. హెచ్. కె. బిగ్ నందు 108 గృహాలు, 2 బిహెచ్ కె నందు 81 గృహాలుగా మొత్తం 297 గృహాలు నిర్మించబడ్డాయి. ఈ పరిశీలనలో దేవాదాయశాఖ చీఫ్ ఇంజనీర్ జీవీఆర్ శేఖర్, దేవాదాయశాఖ స్థపతి పి పరమేశ్వరప్ప, దేవాదాయశాఖ శిల్పవిభాగపు సలహదారు ఎస్ సుందర్రాజన్, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read Also :
Dhurandhar | ‘ధురంధర్’ కలెక్షన్లపై పాక్ ప్రజల వింత డిమాండ్.. కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి..
Nani | నాని ‘ది ప్యారడైజ్’లో డ్రాగన్ బ్యూటీ.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

