57 ఏళ్లకు పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన ఎమ్మెల్యే.. అది కూడా డ్రైవర్ ప్రోత్సాహంతో..
జిజ్ఞాసకూ, వయస్సుకు ఏమాత్రం సంబంధముండదని ఒడిశా బీజేడీ ఎమ్మెల్యే నిరూపించారు. ఒడిశాకు చెందిన బీజద్ అనే నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు అంగద్ కన్హార్. ఆయనకు 57 సంవత్సరాలు. అయినా.. ఆయన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇతర విద్యార్థులతో కూర్చొని, పదో తరగతి పరీక్షలు రాశారు.
40 ఏళ్ల క్రితం ఆయన డ్రాపవుట్. మళ్లీ 40 ఏళ్ల తర్వాత ఆయన 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాశారు. కుటుంబ ఒత్తిళ్లు, వ్యక్తిగత కారణాల రీత్యా తాను చదువు మానేశానని ఎమ్మెల్యే అంగద్ పేర్కొన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ సాధారణ విద్యార్థిగా పదో తరగతి పరీక్షలు రాశానని చెప్పుకొచ్చారు.
50 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకే నేను పదో తరగతి పరీక్షలు రాయాలని ఫిక్స్ అయ్యా. పరీక్షలు రాయడానికి గానీ, చదువుకోడానికి గానీ వయస్సుతో ఏమాత్రం సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
డ్రైవర్ ప్రోత్సాహంతోనే పరీక్షలు రాసిన ఎమ్మెల్యే
దాదాపు 57 సంవత్సరాల వయస్సులో బీజేడీ ఎమ్మెల్యే అంగద్ కన్హార్ పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే.. ఈ వయస్సులో ఆయన పరీక్షలు రాయడానికి ప్రోత్సహించిందెవరు? అన్న ప్రశ్న వస్తుంది. ఆయన స్పేహితులతో పాటు ఆయన కారు డ్రైవర్ ఈయనను ప్రోత్సహించారని ఎమ్మెల్యే వెల్లడించారు. పరీక్షలో పాస్ అవుతానో లేదో, తెలియదు కానీ.. పరీక్షలు మాత్రం రాశానని ఎమ్మెల్యే అంగద్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

