భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలోని ఓ గ్రామంలో నాగుపాములు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ బావిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 పాములు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ బావిలోకి తొంగి చూడటంతో పాము కనిపించింది. దాంతో ఆమె గ్రామస్తులకు తెలియజేయగా వారు స్నేక్ హెల్ప్లైన్కు ఇచ్చారు. వాళ్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ పాము కోసం వెతుకగా మొత్తం 15 పాములు కనిపించాయి. ఆ పాములన్నింటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Odisha: 15 baby Cobra Snakes rescued from a well by snake helpline in Ganjam district
— ANI (@ANI) July 18, 2021
"I got a call from Brahmapur saying that a woman saw some snakes in a well. We rescued 15 baby Cobra Snakes & released them safely in reserved forest," says Swadesh Kumar Sahu, Snake Help Line pic.twitter.com/WfqnFUtS7z