న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశంలోని సియాటెల్ నగరం అక్టోబర్ 19వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం’గా ప్రకటించింది. ప్రపంచంలో శాంతి, మానవతా విలువల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శ్రీశ్రీ రవిశంకర్కు ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
వాంకోవర్ నగరం కూడా అక్టోబర్ 18వ తేదీని శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించింది. ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నెలకొల్పాలనేది రవిశంకర్ లక్ష్యమని సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ తెలిపారు. అందుకే ఆయన లక్ష్యం 180 దేశాల్లో 8 కోట్ల మందిని ప్రభావితం చేసిందని ప్రశంసించారు.