న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లైంగిక కార్యకలాపాలను ప్రదర్శిస్తున్న ఉల్లూ యాప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) కేంద్రాన్ని కోరింది.
ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో కేంద్రానికి ఈమేరకు లేఖ రాశారు. యాప్ తన సబ్‌స్ర్కైబర్లకు అశ్లీల దృశ్యాలను చూపిస్తున్నదని తెలిపారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ దీనిపై తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు.