పానాజీ, మార్చి 26 : బీజేపీ నాయకుడి కుమారుడు ఒకడు సుమారు 25-30 మంది బాలికలపై లైంగిక దోపిడీకి పాల్పడటమే కాక, వారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన దారుణ ఘటన దక్షిణ గోవాలో వెలుగుచూసింది. 22 ఏండ్ల సోహమ్ నాయక్‌గా గుర్తించిన నిందితుడు బీజేపీ కార్పొరేటర్ శుశాంక్ నాయక్ కుమారుడు కావడం గమనార్హం.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు గత మూడేండ్లుగా మైనర్లను వేధిస్తూ బలవంతం చేస్తున్నట్టు గుర్తించారు. వారిని వీడియో తీసి, అవి చూపించి బెదిరిస్తూ బాధితులను నోరెత్తకుండా బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు. దీంతో వారు భయం, అవమానం, సామాజిక ఒత్తిళ్లతో ఫిర్యాదు చేయలేదని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.