న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ (NYT Cartoon) గతంలో భారత్‌ను కించపరిస్తూ ఒక కార్టూన్ ప్రచురించింది. తాజాగా చంద్రయాన్-3 సక్సెస్ నేపథ్యంలో ఆ పాత కార్టూన్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 2014లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మార్స్ మిషన్ మంగళయాన్ విజయవంతమైంది. కేవలం రూ.450 కోట్ల వ్యయంతో మార్స్ కక్ష్యలోకి ప్రోబ్‌ను భారత్ పంపింది. దీంతో మార్స్ మిషన్లు చేపట్టిన అమెరికా, రష్యా, ఐరోపా దేశాల సరసన భారత్ చేరింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ వ్యంగ్యంగా ఒక కార్టూన్ ప్రచురించింది. పాశ్చాత్య వస్త్ర ధారణతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ‘ఎలైట్ స్పేస్ క్లబ్’లో కూర్చొని ఉంటారు. భారతీయ గ్రామీణ వ్యక్తి ఒక ఆవుతో దాని డోర్‌ను తడుతున్నట్లుగా కార్టూన్లో ఉంటుంది. జాత్యహంకారాన్ని ప్రదర్శించినట్లుగా ఉన్న ఆ కార్టూన్‌పై నాడు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పత్రిక అనంతరం క్షమాపణలు చెప్పింది.
కాగా, చంద్రయాన్-3 మిషన్‌తో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అలాగే భారత్ కంటే రెండు రోజులు ముందుగా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు రష్యా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ దేశం పంపిన లూనా 25న అక్కడ కూలిపోయింది. అమెరికా కూడా ఇప్పటి వరకు చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్‌ను దించే ప్రయోగాలు చేయలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
New Cartoon
ఈ నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ పాత కార్టూన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యింది. నెటిజన్లు చంద్రయాన్-3 విజయాన్ని ఆ పత్రికకు ట్యాగ్ చేశారు. ఈ విజయం గురించి కొత్త కార్టూన్ ప్రచురించాలని కొందరు డిమాండ్ చేశారు. ‘ఇప్పుడు మీ నోరు మూయించాం’ అని కౌంటర్ ఇచ్చారు. అలాగే వరుస అంతరిక్ష విజయాలతో దూసుకెళ్తున్న భారత్ తలుపును అగ్రదేశాలు తడుతున్నట్లుగా ఉన్న మరో కార్టూన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Recalling @nytimes for their Racial Taunt. You chuckled, questioning our capabilities. Today, we silence you with our triumph!
Now, go ahead & sketch a fresh cartoon.#IndiaOnTheMoon #Chandrayaan3Landing #ISRO 🫡 pic.twitter.com/K1nd7W2yd6
— YSR (@ysathishreddy) August 23, 2023
Never forget @TOIIndiaNews cartoon reply to @nytimes when it mocked India’s space program pic.twitter.com/L5M64L9BIc
— Nav (@Navdeepak_) August 23, 2023