కోల్కతా, ఫిబ్రవరి 12: పశ్చిమ బెంగాల్లో తొలి నిపా వైరస్ మరణం నమోదైంది. 24 పరగణాల జిల్లాలో ఒక ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న 25 ఏండ్ల నర్సుకు నిపా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించింది. అయితే నిపా వైరస్ కారణంగానే ఆమె మరణం సంభవించినట్టు నిర్ధారించలేమని, అయితే వ్యాధి లక్షణాలను బట్టి ఆ వ్యాధి వల్ల మృతి చెందినట్టు భావిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా, ఆ నర్సుతో పాటు మరో ఇద్దరు నర్సింగ్ సిబ్బందికి ఈ వ్యాధి సోకిందని దవాఖాన వర్గాలు తెలిపాయి. ఈమెతో పాటు వ్యాధి సోకిన ఒక మేల్ నర్సు కోలుకుని జనవరిలోనే డిశ్చార్జి అయినట్టు చెప్పారు.