శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఎన్కౌంటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 5 వరకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో కేవలం 27 మంది ఉగ్రవాదులు (Terrorists) చనిపోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారిలో 19 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే 78 శాతం తక్కువని పేర్కొన్నారు. 2022లో ఇదే సమయంలో 125 మంది హతమయ్యారని అధికారులు తెలిపారు. వారిలో 91 మంది స్థానికులు (Local terrorists), 34 మంది విదేశీ టెర్రరిస్టులు (Foreign terrorists) ఉన్నారని చెప్పారు.
రెండు సంవత్సరాలను పోల్చిచూస్తే స్థానిక ఉగ్రవాదుల సంఖ్య 91 శాతం, విదేశీయుల సంఖ్య 44 శాతం తగ్గిందని వెల్లడించారు. 2022లో జమ్ముకశ్మీర్లో మొత్తంగా 187 మంది ఉగ్రవాదులు హతమవగా, 111 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. వారిలో 130 మంది స్థానికులు ఉండగా, 57 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు.