అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు.. ఉద్యోగాలు దక్కించుకోవటంలో దూసుకుపోతున్నారు. పురుషులను మించి నౌకర్లు సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2023 ప్రకారం.. ఈ ఏడాదికి మహిళా ఉద్యోగుల సంఖ్య 52.8 శాతానికి పెరిగింది. వీరి సంఖ్య వచ్చే ఏడాది నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. 15కిపైగా రంగాలు, 150 కార్పొరేషన్లు పాల్గొన్న ఈ సర్వేలో 3.75 లక్షల మంది ఫ్రెషర్లు వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌లో పాల్గొన్నారు. దీని ప్రకారం.. ఉద్యోగయోగ్యత సాధించినవాళ్లలో మహిళలే ఎక్కువ. పురుషులు 47.2 శాతానికే పరిమితమయ్యారు.
నివేదికలోని మరిన్ని కీలకాంశాలు