Attack | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jublihills Bye Elections) ప్రచారం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు. గత మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగింది. మహిళలపై NSUI అధ్యక్షుడు వెంకటస్వామి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై కోపంతో వెంకటస్వామి మహిళలపై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్లోని బ్రహ్మశంకర్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తోపాటు ముగ్గురు మహిళలపై వెంకటస్వామి తన అనుచరులతో కలిసి దాడిచేశాడు. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై కోపంతో.. ఆయన మనుషులు తనకు అడ్డుగా ఉన్నారని వారిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వెంకటస్వామి ఇండ్లలోకి దూసుకెళ్లి, మహిళలని కూడా చూడకుండా వివస్త్రలను చేసి కొట్టాడని స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు.
వెంకటస్వామి దాడిలో గాయపడిన ఈశ్వరమ్మ, రజిత, మీనాక్షి అనే మహిళలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని స్థానిక బస్తీ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.