గల్ఫ్ నర్సులపై అనుచిత వ్యాఖ్యలు : క్షమాపణ కోరిన ఎన్ఆర్ఐ ఆరెస్సెస్ కార్యకర్త
ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరువనంతపురంలో జరిగిన హిందూ సమ్మేళనం ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు.
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరువనంతపురంలో జరిగిన హిందూ సమ్మేళనం ప్రకంపనలు ఇంకా సమసిపోలేదు. అనంతపురి హిందూ మహాసమ్మేళనంలో మాట్లాడిన వివాదాస్పద రాజకీయనేత పీసీ జార్జ్‌ను ముస్లింలకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసినందుకు అరెస్ట్ చేయగా ఈ భేటీలో ఓ ఎన్ఆర్ఐ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో దుమారం రేపాయి. గల్ఫ్‌లో టెర్రరిస్టులకు సెక్స్ బానిసలుగా మళయాళీ నర్సులను రిక్రూట్ చేసుకుంటున్నారని ఖతర్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్త దుర్గాదాస్ శిశుపాలన్పై విమర్శలు వెల్లువెత్తాయి.
దుర్గాదాస్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని నర్సుల అసోసియేషన్ యూఎన్ఐక్యూ (యునైటెడ్ నర్సెస్ ఆఫ్ ఇండియా ఖతార్) వెల్లడించింది. దుర్గాదాస్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మళయాళాన్ని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వ ప్రోద్బలంతో పనిచేస్తున్న మళయాళం మిషన్ ఖతార్ యూనిట్ నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు తెలిపింది.
ఇక నారంగ్ ప్రాజెక్ట్స్ నుంచి దుర్గాదాస్‌ను తొలగిస్తున్నట్టు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. కాగా ఫేస్బుక్ లైవ్‌లో దుర్గాదాస్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను గల్ఫలో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నానని 30 ఏండ్లుగా స్వయంసేవక్‌గా ఉన్నానని చెప్పారు. హిందూ సమ్మేళనంలో తాను అడిగిన ప్రశ్నను వీడియో క్లిప్‌లో చూసినవారికి తప్పుగా అర్ధం అయినట్టు ఉందని అన్నారు. తన ప్రశ్నపై నర్సులు ఎవరైనా బాధపడితే వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

