న్యూఢిల్లీ : కాలా చష్మా పెర్ఫామెన్స్‌తో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన నార్వే డ్యాన్స్ బృందం క్విక్ స్టైల్ ఆపై పలు ఫెర్పామెన్స్లకు అద్భుత ఆదరణ పొందింది. తాజాగా క్విక్ స్టైల్ షారుక్ ఖాన్ మూవీ దిల్ తో పాగల్ హై మూవీ నుంచి ముజ్కో హు న ఖబర్ సాంగ్‌కు ఇచ్చిన డ్యాన్స్ ఫెర్ఫామెన్స్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
ఈ షార్ట్ క్లిప్‌లో క్విక్ స్టైల్ టీమ్ మంచి ఈజ్, గ్రేస్‌తో ఈ సాంగ్‌కు డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చింది. క్యాచీ ట్రాక్‌కు వీరు అలవోకగా డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మళ్లీ మరో క్లాసిక్‌తో ముందుకొచ్చాం..దిల్ తో పాగల్ హై, హైనా? అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత ఈ వీడియో 26 లక్షల వ్యూస్‌ను రాబట్టింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకోగా కామెంట్స్ సెక్షన్లో నెటిజన్లు క్విక్ స్టైల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. మీరు మా హృదయాలను కొల్లగొట్టారని ఓ యూజర్ రాసుకురాగా, ఓమైగాడ్ మీ పెర్ఫామెన్స్‌తో బాల్యాన్ని నా కండ్ల ముందుంచారని మరో యూజర్ కామెంట్ చేశారు.