న్యూఢిల్లీ : ప్రధాని మోదీని పాములవాడిగా చిత్రీకరిస్తూ నార్వే వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కార్టూన్ తీవ్ర వివాదానికి దారితీసింది. సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ చర్యను పలువురు నెటిజన్లు నిరసిస్తూ తీవ్రంగా తప్పుబట్టారు.
నార్వేలోని ప్రముఖ దినపత్రిక ఆఫ్టన్పోస్ట్లో ప్రచురితమైన ఈ కార్టూన్లో మోదీని ఒక పాములు పట్టేవాడిగా చిత్రించారు. ఇందులో మోదీ నాదస్వరం ఊదుతుండగా, పెట్రోల్ బంక్‌లోని ఇంధన పైపు పాములా ఆడుతున్నట్టు చిత్రీకరించారు. ఈ కార్టూన్‌కు ‘ఒక తెలివైన, కాస్త చికాకు కలిగించే వ్యక్తి’ అని శీర్షిక పెట్టారు.