న్యూఢిల్లీ: ఎడతెగని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈశాన్యంలోని జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీగా వర్షాలు కురిశాయి. దీంతో వరద ఉధృత వల్ల పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో మేఘాలయలోని లుమ్ష్నాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 6 (ఎన్‌హెచ్ 06) భారీగా ధ్వంసమైంది. ఒక లారీ, కారు ఒక గుంతలో కూరుకుపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన విపత్తు నిర్వాహణ అధికారులు సమాయక చర్యలు చేపట్టారు. ఎన్‌హెచ్ 6పై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో మరో రహదారి వైపు వెళ్లాలని వాహనదారులకు సూచించారు.
కాగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల పలు రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. పలు ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ట్రాఫిక్‌ను సరిదిద్ది నిలిచిన వాహనాల కదలికలను గాడిలో పెట్టే చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ఒక భారీ లారీ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | East Jaintia Hills, Meghalaya: Due to an unrelenting heavy downpour, some parts of the road on National Highway-6 under Lumshnong Police Station limits got heavily damaged, leading to traffic disruption.
(Source: East Jaintia Hills district police) pic.twitter.com/8huoFIiN86
— ANI (@ANI) June 16, 2022