న్యూఢిల్లీ: హంటా వైరస్ తర్వాత ఇప్పుడు నోరోవైరస్ కలకలం రేపుతున్నది. కరీబియన్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో నోరో వైరస్ కారణంగా వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. డచ్ క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలోనే మరో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది.
నోరో వైరస్ వ్యాపించిన నౌకలో 3,116 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారని.. వైరస్ బారిన పడిన వారికి వాంతులు, అతిసారం లక్షణాలున్నాయని నౌకా సిబ్బంది తెలిపా రు. ఈ నెల 11న నౌక పోర్ట్ కెనావెరాల్ చేరుకున్నప్పుడు దాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ఇన్ఫెక్షన్ రహితంగా చేస్తామని నౌక యజమాన్యం తెలిపింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు తరచూ చేతులు కడుక్కోవాలని సూచించింది.