లక్నో: కొందరు విద్యార్థులు ఖరీదైన కార్లతో రోడ్లపై స్టంట్లు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అమిటీ యూనివర్శిటీకి చెందిన కొందరు విద్యార్థులు నోయిడాలోని సెక్టార్ 126లో రెండు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్ కార్లతో ఖాళీ రోడ్లపై విన్యాసాలు చేశారు. పంజాబీ ర్యాప్ పాటను హోరెత్తిస్తూ ప్రమాదకరంగా 360 డిగ్రీల స్టంట్లు చేశారు. ఒక పార్కింగ్ స్థలంలో కూడా ఒక కారుతో విన్యాసాలు చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది నోయిడా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో కార్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేయడంపై దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఆ విద్యార్థులు ఖరీదైన కార్లతో ఈ విన్యాసాలు చేసినట్లు భావిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. విద్యార్థుల కార్ల విన్యాసాలను పలువురు తప్పుపట్టారు. వారు ప్రమాదంలో పడటంతోపాటు ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తారంటూ కొందరు విమర్శించారు.
NOIDA
एमिटी यूनिवर्सिटी में रहीशजादों की स्टंटबाजी,
फॉर्च्यून से ड्रिफ्ट मरते वीडियो वायरल
PS 126@noidapolice@noidatraffic @Uppolice pic.twitter.com/4W9hVh8zBm— हिमांशु शुक्ला (@himanshu_kanpur) December 23, 2022