Luxury Villa | నోయిడా, అక్టోబర్ 29: లగ్జరీ విల్లాలను విక్రయించేందుకు నోయిడాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆకర్షణీయమైన ఆఫర్ను ప్రకటించింది. తమ విల్లాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఖరీదైన లాంబొర్గిని కారును ఉచితంగా ఇస్తామని వెల్లడించింది.
జేపీ గ్రీన్స్ అనే ప్రముఖ రియల్టీ సంస్థ ఇచ్చిన ఈ ఆఫర్ను గౌరవ్ గుప్తా అనే రియల్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ఈ సంస్థ గ్రేటర్ నోయిడాలో లగ్జరీ విల్లాలను నిర్మించింది. రూ.26 కోట్లు ఖరీదు చేసే ఈ విల్లాలను కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల విలువ చేసే లాంబొర్గిని ఉరుస్ కారును ఉచితంగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది.