బారాబంకీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కావొస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదర్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే దినేష్ రావత్ తనకు ఓటు వేయని వారంతా.. తన నుంచి ఎలాంటి ఆదరాభిమానాలు ఆశించొద్దని చెప్పారు. అలాంటి వ్యక్తులు సహాయం కోసం నా వద్దకు రాకూడదని, నాకు ఓటు వేసిన వారికి మాత్రమే సహాయం చేస్తాను అని హోలీ మిలన్ కార్యక్రమంలో చెప్పారు. ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీకి చెందిన రావత్.. ఎస్పీ అభ్యర్థిపై 25వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతను వివరణ కోరగా.. కొత్త ఎమ్మెల్యేలు సెట్ అయ్యేందుకు సమయం పడుతుందన్నారు. అయినా, వినయంగా ఉండాలని.. ప్రజలను గౌరవించాలని తాము వారికి చెబుతామని పేర్కొన్నారు.
‘Those who did not vote for BJP, should not come to us for any kind of help’
BJP MLA from Haidergarh in Uttar Pradesh Dinesh Rawat pic.twitter.com/EDvw7pz3xW
— आफताब खाँ सामाजिक कार्यकर्ता (@Aftabkhaa1) March 21, 2022