లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి వీఐపీ సంస్కృతి లేదని ఆ రాష్ట్ర మంత్రి నంద గోపాల్ గుప్తా అలియాస్ నంది తెలిపారు. దీనిని తెలియజేసేందుకు ఒక గ్రామస్తుడి ఇంట్లో ఆయన స్నానం చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. షాజహాన్‌పూర్ జిల్లాలోని గ్రామంలో చేతి పంపు వద్ద స్నానం చేసిన వీడియోతోపాటు విధులకు రెడీ అవుతున్న మరో క్లిప్‌ను తన ట్విట్టర్ ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎలాంటి వీఐపీ కల్చర్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
‘ఉదయం టీతో రోజు ప్రారంభమైంది. షాజహాన్‌పూర్ జిల్లా సింధౌలీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని చక్ కనాహు గ్రామంలో లీల్రామ్ భార్య సహోదర ఇంట్లో గత రాత్రి బస చేశాను. చేతి పంపులోని నీళ్లతో అక్కడ స్నానం చేశాను’ అని మంత్రి నంద గోపాల్ గుప్తా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘యోగి ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే. యోగి ప్రభుత్వం, సామాన్యులకు మధ్య ఎటువంటి దూరం లేదా తేడా లేదు. అలాగే వీఐపీ కల్చర్ కూడా లేదు’ అని మరో ట్వీట్ చేశారు.
కాగా, మంత్రి నంద గోపాల్ గత వారం కూడా బరేలీని సందర్శించారు. ఒకరి ఇంట్లో రాత్రి బస చేసిన తర్వాత మరునాడు అక్కడి చేతి పంపు వద్ద స్నానం చేశారు. ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీఎస్పీ, కాంగ్రెస్ పూర్వ నాయకుడైన ఆయన 2017లో బీజేపీలో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా ఉన్నారు.
योगी सरकार और पिछली सरकारों में यही अंतर है। योगी सरकार में आम जनता और सरकार के बीच में न कोई दूरी है और न ही कोई अंतर और न ही कोई वीआईपी कल्चर। pic.twitter.com/tUZ0kFbV7R
— Nand Gopal Gupta 'Nandi' (@NandiGuptaBJP) May 7, 2022