న్యూఢిల్లీ, జూన్ 26: ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై కూడా టోల్ ట్యాక్స్‌ను విధిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రణాళిక ఏమీ లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి వార్తలు వేయవద్దని, ఇది పాత్రికేయ వృత్తికి ఆరోగ్యకరం కాదని, దీనిని తాను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. టోల్ గేట్ల వద్ద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు ఇచ్చే టోల్ మినహాయింపు యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కూడా ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొంది.