National
- Nov 28, 2020 , 01:22:46
సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లోవైద్యులకు రిజర్వేషన్లకు నో

న్యూఢిల్లీ: సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్సర్వీస్ వైద్యులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. వైద్యులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రతిభ కలిగిన అభ్యర్థులకు నష్టదాయకమని, 50 శాతం సీట్లు వారు కోల్పోతారని పేర్కొంది. కేరళ హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తాజావార్తలు
MOST READ
TRENDING