Metropolitan Cities : బెంగళూరుకు మెట్రో పాలిటన్ సిటీ హోదా ఇవ్వాలనే విషయంలో తమ ముందుకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. బెంగళూరుకు మెట్రో సిటీ హోదా ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందా.. లేదా..? అని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.
సాధారణంగా ఒక నగరానికి మెట్రోపాలిటన్ సిటీ హోదా ఉంటే హౌస్ రెంట్ అలవెన్స్‌పై అదనంగా 10 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాలకు మాత్రమే మెట్రో పాలిటన్ సిటీ హోదా ఉన్నది. ఆ నగరాల్లో పన్ను చెల్లింపుదారులకు హెచ్ఆర్ఏపై 10 శాతం అదనంగా పన్ను మినహాయింపు సదుపాయం ఉన్నది.