ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రద్దు చేసి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కశ్మీర్లో ఒక్కటంటే ఒక్క ప్లాట్‌ను కూడా బయటి వ్యక్తులు కొనలేదు. 370 అమలు ఉన్న సమయంలో అక్కడ బయటి వ్యక్తులు ప్లాట్లు కొనరాదన్న నిబంధన ఉండేది. కేవలం స్థానికులు మాత్రమే ప్లాట్లను కొనాలన్న నిబంధన ఉండేది.
కానీ.. ఆర్టికల్ రద్దైన తర్వాత కూడా కశ్మీర్ లోయలో బయటి ప్రాంతం వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్లాట్‌ను కొనకపోవం విడ్దూరం. జమ్మూ ప్రాంతంలో మాత్రం 7 ప్లాట్లు మాత్రం అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు జమ్మూ కశ్మీర్లో ప్లాట్లు కొన్నారా? కొంటే వారి వివరాలు తెలపండి? అని కేంద్రాన్ని సభలో కొందరు సభ్యులు ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పై విధంగా స్పందించారు.