Sachin Pilot | కంగనపై సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలను ఖండించిన సచిన్ పైలట్
Sachin Pilot | హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అభ్యర్థి కంగనారనౌత్ పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలను రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ఖండించారు.
Sachin Pilot | హిమాచల్‌ప్రదేశ్ లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పందించారు. ‘ఒకవేళ కొందరు కొన్ని తప్పు అంశాలు మాట్లాడవచ్చు. దాన్ని మేం ఎప్పుడూ సమర్థించం. అన్ పార్లమెంటరీ భాష వాడొద్దు. వ్యక్తిత్వ హననం సరైన చర్య కాదు. అంశాల వారీగా రాజకీయాలు ఉండాలి’ అని గురువారం ఎన్డీటీవీ నిర్వహించిన యువ కాంక్లేవ్‌లో సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
‘సార్వత్రిక ఎన్నికల్లో మేం అంశాలపైనే ఫోకస్ చేస్తాం. సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశాలను మాత్రమే ప్రచారాస్త్రాలుగా వాడతాం’ అని సచిన్ పైలట్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కంగనారనౌత్ పోటీ చేస్తుండటంతో ఆమెకు వ్యతిరేకంగా సుప్రియా శ్రీనాథే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభ్యంతరకరమైన పోస్ట్ వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. సుప్రియా శ్రీనాథేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుప్రియా శ్రీనాథేపై కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి సాధారన మహిళ గౌరవాన్ని కాపాడే పాత్రలను సినిమాల్లో నటించానని గుర్తు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

