(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): సిక్స్‌ప్యాక్ కోసం యువకులు జిమ్‌లలో కసరత్తులు చేస్తూ ఉంటారు. శరీరానికి ప్రొటీన్లు అందించడానికి, కండరాలు ఆకర్షణీయంగా కనిపించడానికి టెస్టోస్టిరాన్ సప్లిమెంట్లను తరుచూ వాడుతూ ఉంటారు. ఈ సప్లిమెంట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు పెరుగుతుందని, ధమనులపై ఒత్తిడి పెరిగి గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలు ‘సైన్స్ అలర్ట్’లో ప్రచురితమయ్యాయి.