పైసల్లేవ్..అప్పు తెచ్చి జీఎస్టీ బకాయిలు చెల్లిస్తాం

ఎంపీ బండా ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు కేంద్రం దగ్గర సరిపడా నిధుల్లేవని, అప్పు తెచ్చి చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలపై టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాశ్ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం వద్ద అవసరమైన నిధుల్లేవని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నిధిని సమకూర్చేందుకు రూ.1.59 లక్షల కోట్లు అప్పులు తేవాలని జీఎస్టీ 43వ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందని చెప్పారు. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3,88,908 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.1,36,524 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి అన్నారు. ఇందులో తెలంగాణకు ఇప్పటివరకు చెల్లించింది రూ.6218 కోట్లు కాగా, మరో రూ. 4073 కోట్లు చెల్లించాల్సి ఉందని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

