
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఏదైనా కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తే అప్పుడు దానికి ప్రాదేశిక పరిమితులు ఉండవని, ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సాధారణంగా వేరే రాష్ట్రంలో నమోదైన కేసుకు సంబంధించి వేరే రాష్ట్ర పరిధిలో దర్యాప్తు జరుపాల్సి వచ్చినప్పుడు సీబీఐ ఆ రాష్ట్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
వారసత్వ వివాదాల పరిష్కారానికి వేరే ఏ ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్షలను అవసరం లేకున్నా నిర్వహించవద్దని సూచించింది. పరీక్షకు సుముఖంగా లేని వ్యక్తికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించడం అతని గోప్యత, వ్యక్తి స్వేచ్ఛ హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. త్రిలోక్చంద్ గుప్తా, సోనా దేవి దంపతులకు(వీరు చనిపోయారు) నేనే వారసుడినంటూ అశోక్ కుమార్ అనే వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్లాడు. దీనిని ఆ దంపతుల ముగ్గురు కూతుర్లు వ్యతిరేకిస్తున్నారు. డీఎన్ఏ టెస్టు చేయాలని కోరారు.