Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే ఏమిటో తెలియదని, దానికి చెందిన సమాచారం లేదని, డేటాబేస్ కూడా లేదని కేంద్ర హోంశాఖ చెప్పింది. ఆర్టీఐ ద్వార అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ రిప్లై ఇచ్చింది.
న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజం అంతం అవుతోందని, కానీ దిమాగీ నక్సల్స్(Dimagi Naxals)తో అప్రమత్తంగా ఉండాలని గత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే. దిమాగీ నక్సల్ అన్న పదాన్ని ఆయన వాడిన తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే ఇంతకీ దిమాగీ నక్సల్స్ అంటే ఏంటో ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. రాజకీయ దుమారం రేపిన ఆ పదంపై .. ఓ వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద కేంద్ర హోంశాఖను ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిక కేటగిరీలో దిమాగీ నక్సల్స్ ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్లు ఎవరో చెప్పాలని ఆర్టీఐ ద్వారా నిలదీశారు. దిమాగీ నక్సల్ వ్యక్తులను గుర్తించడం ఎలా అని ఆర్టీఐలో అడిగారు. 2026 ఆగస్టు 29వ తేదీన 06945 రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కేంద్ర హోంశాఖ వద్ద ఆర్టీఐ దరఖాస్తు చేశారు. దీనికి కేంద్ర హోంశాఖలోని వామపక్ష తీవ్రవాద డివిజన్‌కు చెందిన సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్పందించారు. సెప్టెంబర్ 30వ తేదీన సీపీఐఓ రియాక్ట్ అవుతూ.. తమ వద్ద దిమాగీ నక్సల్‌కు చెందిన సమాచారం లేదన్నారు. సంబంధిత అధికారి ముందు 30 రోజుల్లోగా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 19(1) కింద దరఖాస్తు చేసుకోవాలని సీపీఐఓ కోరింది.
దిమాగీ నక్సల్ అన్నమాటకు ప్రభుత్వం వద్ద నిర్వచనం లేదు. దిమాగీ నక్సల్స్‌కు చెందిన డేటాబేస్ కూడా లేదు. దిమాగీ నక్సల్స్ ఉన్నట్లు ప్రభుత్వం వద్ద ఎటువంటి ఆధారాలు లేవని హోంశాఖ చెప్పింది. ఆగస్టు 15వ తేదీ ప్రసంగంలో ప్రధాని మోదీ ఆ మాటను వాడడం పట్ల వివాదం చెలరేగింది. సాయుధ నక్సలిజం తుది దశకు చేరుకున్నదని, కానీ నక్సల్ మైండ్‌సెట్ ఉన్నవారిని గుర్తించి, వేరు చేయాలని ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు. దిమాగీ నక్సల్స్ పదానికి అర్థం ఏంటి, దాని పరిధి ఏందన్న దానిపై విపక్షం స్పందించలేదు. దిమాగీ నక్సల్ అని పిలుచుకోవడానికి గర్వపడుతున్నట్లు కాంగ్రెస్ నేత పీ చిదంబరం అన్నారు. మావోలకు మద్దతు ఇచ్చేవారిని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారిని, వేర్పాటువాదులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసినట్లు పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
దిమాగీ నక్సల్స్ కేటగిరీ కింద ఎంత మందిని గుర్తించారో చెప్పాలని ఆర్టీఐ అప్లికేషన్లో కోరారు. రాష్ట్రాల వారీగా ఎంత మంది దిమాగీ నక్సల్స్ ఉన్నారో వెల్లడించాలని అడిగారు. ఏ ఆధారంగా నక్సల్స్‌ను క్లాసిఫై చేసినట్లు ప్రశ్నించారు. ఓ వ్యక్తిని దిమాగీ నక్సల్‌గా గుర్తించేందుకు కావాల్సిన చట్టపరమైన , పరిపాలనా పరమైన అంశాలు ఏంటని అడిగారు. మార్గదర్శకాలు, సర్క్యూలర్లు, ఎస్‌వోపీలు,రిపోర్టులు ఉంటే ఇవ్వాలని ఆర్టీఐ ప్రశ్నించింది. దిమాగీ నక్సల్స్ పేరిట గత అయిదేళ్లలో అరెస్టు అయినవారు, ఛార్జీషీట్లు ఉన్నవారి పేర్లను ఇవ్వాలని ఆర్టీఐలో కోరారు. దిమాగీ నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధివిధానాలను అవలంబిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎవరు దిమాగీ నక్సల్స్ అన్న క్లారిటీ ఇంత వరకు లేదని ఆర్టీఐ ద్వారా తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

