లక్నో : 18 ఏండ్ల లోపు బాలబాలికలు బహిరంగ ప్రదేశాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకూడదని, సగం ప్యాంట్లు ధరించకూడదని యూపీలోని బాగ్పట్ జిల్లాలోని ఓ ఖాప్ పంచాయతీ నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్ల్లో హాఫ్ ప్యాంట్లు ధరించడం సామాజిక నియమాలకు వ్యతిరేకమని పంచాయతీ అభిప్రాయపడింది.
స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల చదువుపై ప్రభావం పడుతోందని, పెద్దల పట్ల వారు అవిధేయత ప్రదర్శించే పరిస్థితి వచ్చిందని వారు వివరించారు. పెండ్లిండ్లు ఫంక్షన్ హాళ్లలో కాకుండా పల్లెలు, ఇండ్లలో జరగాలని తెలిపింది. ఫంక్షన్ హాళ్లలో చేసే వివాహాలు కుటుంబ సంబంధాలను బలహీనపరుస్తున్నాయని వారు తెలిపారు.