న్యూఢిల్లీ : ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని వచ్చే నెల 1 నుంచి మార్చుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఫాస్టాగ్‌కు బదులుగా శాటిలైట్ విధానాన్ని అమలు చేయబోతున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదంది. రోడ్డు రవాణా, హైవేల శాఖ కాని, ఎన్హెచ్ఏఐ కాని అటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్-ఫాస్టాగ్ హైబ్రిడ్ టోలింగ్ సిస్టమ్‌ను కొన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాలలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది.