పట్నా: జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్‌కుమార్ తనయుడు నిశాంత్ కుమార్.. బీహార్‌లోని సీఎం సమ్రాట్ చౌధరి ప్రభుత్వంలో చేరబోతున్నారు. గురువారం చేపట్టబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కనున్నదని జేడీయూ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి దాదాపు 12 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని, వీరి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ హాజరవుతారని తెలిసింది. నిశాంత్ జేడీయూలో చేరి.. రెండు నెలలైనా కాలేదు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచే కూటమి ప్రభుత్వంలో చేరాలని కార్యకర్తలు కోరుతున్నారు. గత నెలలోనే ఆయనను డిప్యూటీ సీఎంగా నియమిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ పదవిని చేపట్టేందుకు ఆయన తొలుత సంశయించారని పార్టీ వర్గాలు తెలిపాయి.