Nitish Kumar : ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరలు బలపరిచారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో బిహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్డీయే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మీ కోసం (ప్రధాని మోదీ) పనిచేయడం సంతోషకరమని అన్నారు.
ప్రధాన మంత్రిగా మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, కానీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. మీరు ఎప్పుడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినా తామంతా మీతోనే ఉంటామని, మీ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేస్తామని మోదీని ఉద్దేశించి నితీష్ కుమార్ పేర్కొన్నారు.
Read More :