కటిహార్, జనవరి 19: బీహార్లోని కటిహార్ జిల్లాలో ఆదివారం గంగా నదిలో ఓ పడవ మునిగిపోయి మూడేళ్ల చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. 15 మంది ప్రయాణిస్తున్న పడవ అందాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్ వద్ద గంగా నదిలో మునిగిందని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఏడుగురిని రక్షించగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డును చేరినట్టు వారు చెప్పారు. మృతులకు సంతాపం ప్రకటించిన సీఎం నితీశ్ కు మార్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.